విభజన హామీల అమలు, హోదా సాధనకై అందరూ కలిసి రావాలని విజయవాడలో ఆంధ్ర మేధావుల ఫోరమ్ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కృష్ణా గోదావరి జలాలపై మేధావుల సలహా తీసుకోవాలని సూచించారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయకుంటే ఎగువ రాష్ట్రాలు నిర్మించే ప్రాజెక్టుల కారణంగా... మొదటి పంటకూ నీరు రాని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి ప్రాధాన్యతగా పోలవరం పూర్తి చేసి రాష్ట్రంలోనే మిగులు జలాలకు సంబంధించిన ప్రాజెక్టులు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నాగార్జున సాగర్ నుంచి నీరు విడుదల చేయాలంటే పలు రకాల అనుమతులు తీసుకోవాల్సి వస్తుందన్నారు. అన్ని గేట్లు, పవర్ ప్రాజెక్టులు తెలంగాణ ఆధీనంలో ఉన్నాయని గుర్తు చేశారు. భవిష్యత్లో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే మిగులు జలాల తరలింపు ప్రాజెక్టులు రాష్ట్ర పరిధిలోనే కట్టాలన్నారు.
'కృష్ణా జలాలపై మేధావుల సలహాలు తీసుకోండి'
హోదా సాధనకై ప్రభుత్వంతో కలిసి అందరూ నడవాలని ఆంధ్రా మేధావుల ఫోరమ్ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కోరారు. తమ సహకారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. కృష్ణా జలాల వినియోగంపై మేధావుల సలహాలు తీసుకోవాలని సూచించారు.
'కృష్ణా జలాలపై మేధావుల సలహాలు తీసుకోండి'