జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఆంధ్ర హాస్పిటల్స్ ఆధ్వర్యంలో తపాలశాఖా.. ప్రత్యేక కవర్‌ను విడుదల చేశారు. తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు డా బీసీ రాయ్ జయంతిన ప్రత్యేక కవర్‌ను విడుదల చేయటం సంతోషకరమని ఆంధ్ర హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ పీవీ రామారావు తెలిపారు. వైద్యునిగా ఎంతో మందికి సేవలందించటమే కాకుండా దేశానికి ఎంతో సేవ చేశారన్నారు. ఆయన జయంతిని జాతీయ వైద్యుల దినోత్సవంగా చేసుకోవటం వైద్యుల త్యాగాలకు గుర్తు అని అన్నారు. ఆయన జయంతిని జాతీయ వైద్యుల దినోత్సవంగా చేసుకోవటం వైద్యుల త్యాగాలకు గుర్తు అని అన్నారు. కరోనా బాధితులకు చికిత్స అందిస్తూ ఎంతో మంది వైద్యులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ వైరస్‌ను అడ్డుకోవాలంటే వ్యాక్సినేషన్‌తో పాటు ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని కోరారు.
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక తపాలా కవర్ - National Physicians Day special event by postal
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఆంధ్ర హాస్పిటల్స్, తపాలశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కవర్‌ను విడుదల చేశారు. తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు బీసీ రాయ్ జయంతి సందర్భంగా ప్రత్యేక కవర్‌ను విడుదల చేయటం ఎంతో ఆనందంగా ఉందని ఆంధ్ర హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ పీవీ రామారావు తెలిపారు.
ఆంధ్ర హాస్పిటల్స్ , తపాలశాఖా