సామాజిక దూరం పాటిస్తేనే కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా వైరస్ అతి వేగంగా ఇతరులకు సోకుతోందని... ప్రజలందరూ 21 రోజులు వరకూ ఇంటి వద్దే ఉండాలని విజ్ఞప్తి చేశారు. వైద్యులను సంప్రదించకుండా ఎలాంటి ఔషధాలు వినియోగించవద్దని కోరారు. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై మరిన్ని వివరాలను ఈటీవీ భారత్ కు వివరించారు.
'సామాజిక దూరమే కరోనా వ్యాప్తికి నివారణ' - ఏపీ కరోనా ప్రభావం వార్తలు
వేగంగా విస్తరిస్తోన్న కరోనా వైరస్ ను నిరోధించేందుకు స్వీయ జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యమని ఆంధ్ర ఆసుపత్రి వైద్యులు డా.రామారావు తెలిపారు. సామాజిక దూరం కచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రధాని సూచించిన విధంగా 21 రోజులు ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని కోరారు.
డా. రామారావు