లబ్ధిదారులు రోడ్డెక్కితే తప్ప టిడ్కో ఇళ్లు కనబడటం లేదా? అని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నిలదీశారు. పట్టణ, నగర ఇళ్ల రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు ఆంక్షలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "లబ్ధిదారులు కట్టిన డీడీలు తిరిగి ఇచ్చివేస్తామంటున్నారు.. దానిపై వడ్డీ భారం ఎవరు భరిస్తారు" అని అడిగారు. ఇంత కాలం వారు నివసిస్తున్న ఇళ్ల అద్దె భారం ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు. ఇష్టానుసారం హామీలు ఇచ్చి ప్లేట్ ఫిరాయిస్తామంటే ఊరుకునేది లేదని అనగాని హెచ్చరించారు.
ఇళ్ల విషయంలో ప్రభుత్వ తీరు సరికాదు: అనగాని - ఇళ్ల పంపిణీపై అనగాని సత్యప్రసాద్ కామెంట్స్
ఇళ్ల విషయంలో వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. కారణాలు లేకుండా ఏడాదిన్నరగా పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇళ్లను చెడగొతున్నారని విమర్శించారు.
![ఇళ్ల విషయంలో ప్రభుత్వ తీరు సరికాదు: అనగాని ఇళ్ల విషయంలో ప్రభుత్వ తీరు సరికాదు: అనగాని](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9623841-231-9623841-1606026940975.jpg)
ఇళ్ల విషయంలో ప్రభుత్వ తీరు సరికాదు: అనగాని