మాటలు మార్చే పోటీలు పెడితే బొత్సకు ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ వస్తుందని అనగాని సత్యప్రసాద్ ఎద్దేవా చేశారు. ఎన్నికలయ్యాక జగన్ మొహం చూడని ఎమ్మెల్యేలు కూడా మమ్మల్ని రాజీనామాలు చేయాలంటున్నారని ధ్వజమెత్తారు. సీమ ప్రజలకు, ఉత్తరాంధ్ర ప్రజలకు జగన్ వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. దళితులు, గిరిజనులపై దాడులు చేయడం తప్ప 14 నెలల కాలంలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని అనగాని మండిపడ్డారు.
'3 నెలలకు కూడా బయటకు రాని సీఎం... 3 రాజధానులు కడతాడా..?' - జగన్‌పై అనగాని సత్యప్రసాద్ కామెంట్స్
మాటలు మార్చి.. మడమలు తిప్పడం వైకాపా రక్తంలోనే ఉందని తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ విమర్శించారు. మూడు నెలలకొకసారి ఇంట్లో నుంచి బయటకు రాని వ్యక్తి మూడు రాజధానులు కడతాడా..? అని ప్రశ్నించారు.
anagani satyaprasad comments on three capitals