ఉపాధి హామీ కూలీలను ఆదుకోవటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. కరోనా కష్టకాలంలోనూ కూలీలు పనులు చేస్తున్నారని..,వైరస్‌తో చనిపోయిన వారి కుటుంబాలకు 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీల శ్రమ వెలకట్టలేనిదని.., మండుటెండలోనూ పనులు చేస్తున్నారని కొనియాడారు. ఉపాధి హామీ కూలీలకు వేతన బకాయిలు చెల్లించాలని అనగాని డిమాండ్ చేశారు. రోజువారీ కూలీ ఆరు వందలకు పెంచాలని.., పనిచేసే ప్రదేశాల్లో మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఉపాధిహామీ కూలీలు వ్యాక్సిన్ కేంద్రాలకు వచ్చేందుకు ఖర్చుల నిమిత్తం రూ. 500 అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
'ఉపాధి హామీ కూలీలను ఆదుకోవటంలో ప్రభుత్వాలు విఫలం' - ఉపాధి హామీ కూలీలపై అనగాని కామెంట్స్
ఉపాధి హామీ కూలీలకు వేతన బకాయిలు చెల్లించి.., రోజువారీ కూలీ ఆరు వందలకు పెంచాలని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. కూలీలు కరోనా వ్యాక్సిన్ కేంద్రాలకు వచ్చేందుకు ఖర్చుల నిమిత్తం రూ. 500 అందించాలన్నారు.
ఉపాధి హామీ కూలీలను ఆదుకోవటంలో ప్రభుత్వాలు విఫలం