ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఓల్డ్ ఈజ్ గోల్డ్: ఈ అవ్వ ఆలోచన బంగారం.. - kamareddy district crime news

ముసలోళ్లకి చాదస్తం ఎక్కువ అంటారు. కానీ ఈ అవ్వను చూస్తే జాగ్రత్త కూడా ఎక్కువనే అనిపిస్తోంది. ఆమె అతి జాగ్రత్తే మూడున్నర తులాల బంగారాన్ని దొంగల కంటపడకుండా కాపాడింది.

ఓల్డ్ ఈజ్ గోల్డ్: ఈ అవ్వ ఆలోచన బంగారం..
ఓల్డ్ ఈజ్ గోల్డ్: ఈ అవ్వ ఆలోచన బంగారం..

By

Published : Dec 5, 2020, 3:47 PM IST

ఓల్డ్ ఈజ్ గోల్డ్: ఈ అవ్వ ఆలోచన బంగారం..

ఓ వృద్ధురాలి ఇంట్లో దొంగలు పడి రూ.4 వేలు చోరీ చేశారు. అయితే ఆ వృద్ధురాలు తెలివిగా వ్యవహరించడంతో మూడున్నర తులాల బంగారు ఆభరణాలు దొంగల పాలు కాకుండా మిగిలాయి. వివరాల్లోకి వెళ్తే... తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో నివాసం ఉంటున్న నెమ్లి పోశవ్వ మహారాష్ట్రలోని చించోలిలో ఉంటున్న తన పెద్ద కుమార్తె వద్దకు వెళ్లారు. తాళం వేసి ఉన్న ఆమె ఇంటి తాళం ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు రూ.4 వేలు ఎత్తుకెళ్లారు.

సమాచారం అందుకున్న డీఎస్పీ శశాంక్‌రెడ్డి బాధితురాలి ఇంటిని పరిశీలించారు. ఇంకా ఇంట్లో ఏమైనా దాచి పెట్టావా అని ఆ వృద్ధురాలిని డీఎస్పీ ప్రశ్నించగా.. మట్టి పొయ్యి కింది భాగంలో గోతి తీసి ఓ డబ్బాలో పెట్టిన ఆభరణాలను చూపించింది. ఆ వృద్ధురాలి ఆలోచనను డీఎస్పీ ప్రశంసించారు.

ఇవీ చూడండి:అసెంబ్లీ తీర్మానం రాజ్యాంగ విరుద్ధం: ఎస్‌ఈసీ

ABOUT THE AUTHOR

...view details