State debts:రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపు లేకుండా ఇష్టారీతిన అప్పులు చేస్తోందని, ఇది భవిష్యత్తు తరాలకు గొడ్డలిపెట్టని అమరావతి ఛార్టర్డ్ అకౌంటెంట్స్ సంఘం అధ్యక్షుడు మహేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. తాము సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదని, అభివృద్ధిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఆదివారం విజయవాడలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘రెండేళ్లలోనే రూ.3లక్షల కోట్ల పైచిలుకు అప్పులు చేశారు. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని స్వయంగా కాగ్ నివేదిక వెల్లడించింది. ఆర్బీఐలో మన రాష్ట్రం కనీస నగదు నిల్వలను కూడా ఉంచడం లేదు. ఇప్పుడు మేల్కొనకపోతే ఆర్థికంగా సంకట స్థితి తప్పదు. ప్రభుత్వం నేరుగా కాకుండా కార్పొరేషన్ల ద్వారా అప్పులు తెస్తోంది. రాష్ట్ర అప్పులను కుబేరుడు కూడా తీర్చలేని పరిస్థితి వస్తుంది’ అని వివరించారు. నియంత్రణ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందని అమరావతి ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఉపాధ్యక్షుడు అమర్‌నాథ్ హెచ్చరించారు.
State debts: 'ప్రభుత్వం ముందుచూపు లేకుండా ఇష్టారీతిన అప్పులు చేస్తోంది' - Amravati Chartered Accountant concern
State debts :రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపు లేకుండా ఇష్టారీతిన అప్పులు చేస్తోందని, ఇది భవిష్యత్తు తరాలకు గొడ్డలిపెట్టని అమరావతి ఛార్టర్డ్ అకౌంటెంట్స్ సంఘం అధ్యక్షుడు మహేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు.
‘నాలుగైదు తరాలు కేవలం వడ్డీలు కట్టాల్సి వస్తుంది. కేవలం సంక్షేమ పథకాలకే ఇంత ఖర్చు చేయడంతోనే అస్తవ్యస్తంగా తయారైంది. వస్తున్న రాబడి రూ.85వేల కోట్లలో దాదాపు రూ.25వేల కోట్ల వరకు వడ్డీ కట్టాల్సి వస్తుంది. 2020-21లో కరోనా కారణంగా ఆదాయం తగ్గిందని, దీని వల్ల అప్పులు చేయాల్సి వచ్చిందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. లెక్కలు చూస్తే 2020-21లో కేవలం రూ.4వేల కోట్ల ఆదాయమే తగ్గింది. రాబడి తగ్గినందునే కేంద్రం గ్రాంట్‌ఇన్ ఎయిడ్ కింద గతేడాదికంటే రూ.10వేల కోట్లు అదనంగా ఇచ్చింది. ఈ విషయం కాగ్ నివేదికలోనే ఉంది’ అని వివరించారు. ఖర్చులు తగ్గించుకొని ఆదాయం పెంచుకునే మార్గాలను ప్రభుత్వం అన్వేషించాలని సంఘం సూచించింది. తీసుకున్న అప్పులను సంపద సృష్టికి, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్రం వినియోగించాలని పేర్కొంది. విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినవి పొందేందుకు పార్టీలకు అతీతంగా కృషి చేయాలని సూచించింది.
ఇదీచదవండి:
DOLLAR SHESHADRI DIED: తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూత
TAGGED:
State debts