రాష్ట్రంలో మహిళలు, బహుజనులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ.. రేపు విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసన దీక్ష చేపడుతున్నామని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాల కోటయ్య తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. ముఖ్యమంత్రి నివాసం వద్ద మహిళపై అత్యాచారం జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
'వైకాపా పాలనలో ఏ సామాజికవర్గం కూడా సంతోషంగా లేదు' - Amravati Bahujan JAC president Potula Bala Kotayya updates
రాష్ట్రంలో మహిళలు, బహుజనులకు రక్షణ లేకుండా పోయిందని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అన్నారు. ముఖ్యమంత్రి నివాసం వద్ద మహిళపై అత్యాచారం జరిగినా... చర్యలు శూన్యమని మండిపడ్డారు. ఈ విషయంపై రేపు విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసన చేపడతామన్నారు.
అమరావతి బహుజన జేఏసీ
వైకాపా పాలనలో ఏ సామాజికవర్గం కూడా సంతోషంగా లేదని పోతుల బాల కోటయ్య విమర్శించారు. దిశ అనేది చట్టం కాదు యాప్ మాత్రమేనని... దాన్ని పక్కనపెట్టి మహిళల రక్షణ కోసం చర్యలు చేపట్టాలన్నారు. ఈ రాష్ట్రాన్ని కాలకేయుల పాలన నుంచి కాపాడడానికి ప్రజలంతా ఏకం కావాలన్నారు
ఇదీ చదవండి:APMDC: 'ఎవరికి సబ్ లీజుకు ఇచ్చారనేది ప్రభుత్వానికి అనవసరం'