విజయవాడలో ట్రాఫిక్ సమస్యతో ప్రజలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గంటల తరబడి రోడ్లపై నిరీక్షించినా వాహనాలు ముందుకు ముందుకు వెళ్లలేక ఇక్కట్లు పడుతున్నారు. 16వ నెంబరు జాతీయ రహదారిపైన అంబులెన్స్ మూడు గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకొందని వాహనంలో ఐసీయూ పేషెంట్ ఉన్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే క్రమంలో పోలీసులు విఫలం చెందారని వాపోయారు. రోడ్డు ప్రమాదం కారణంగా ట్రాఫిక్ నిలిచిన విషయం చెబుతూ.. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఉంటే సమస్య ఇంతవరకూ వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు.
విజయవాడ ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్ - NH-16
కోల్కత్తా నుంచి చెన్నై వెళ్తున్న అంబులెన్స్ 16వ నెంబరు జాతీయ రహదారిపైన మూడు గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే క్రమంలో పోలీసుల విఫలమయ్యారని చోదకులు అసహనం చెందారు.
విజయవాడ ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్