ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Salaries: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల కొత్త జీతాలపై సందిగ్ధత..! - వార్డు సచివాలయాల ఉద్యోగుల కొత్త జీతాలపై సందిగ్ధత

Salaries: ప్రొబేషన్‌ ఖరారైన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు.. ఈ నెలకు సంబంధించి వచ్చే నెలలో అందుకోబోయే కొత్త జీతాలపై సందిగ్ధత ఏర్పడింది. ఆర్థిక శాఖను సంప్రదించి ఖాతాలు తెరిపించడంతోపాటు బడ్జెట్‌ కేటాయించేలా చూడాలని ఖజానా శాఖ సూచించింది.

salary
కొత్త జీతాలపై సందిగ్ధత

By

Published : Jul 24, 2022, 9:46 AM IST

Salaries: ప్రొబేషన్‌ ఖరారైన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు.. ఈ నెలకు సంబంధించి వచ్చే నెలలో అందుకోబోయే కొత్త జీతాలపై సందిగ్ధత ఏర్పడింది. 2022-23 బడ్జెట్‌ నుంచి ఆమెదం తీసుకోవటంతోపాటు.. కొత్త ఖాతాలు తెరవనందున పెరిగిన ఉద్యోగుల జీతాలతోపాటు ఇతర భత్యాల చెల్లింపు సాధ్యం కాదని రాష్ట్ర ఖజానాశాఖ.. గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు లేఖ రాయడం తాజాగా చర్చనీయాంశమవుతోంది.

ఆర్థిక శాఖను సంప్రదించి ఖాతాలు తెరిపించడంతోపాటు బడ్జెట్‌ కేటాయించేలా చూడాలని ఖజానా శాఖ సూచించింది. ఈ పరిణామాలతో పెరిగే జీతాల కోసం ఆశగా నిరీక్షిస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన కొత్త వేతనంతోపాటు ఇతర భత్యాలు ఆగస్టు మొదటి వారంలోనే అందుతాయని అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు మాత్రం చేయలేదు. 2022-23 బడ్జెట్‌లో సచివాలయాల ఉద్యోగులకు నెలకు 15వేల రూపాయల చొప్పున చెల్లించడానికే అనుమతి ఉంది.

క్రమబద్ధీకరణతో పెరిగే జీతాలతోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ వంటి భత్యాలు చెల్లించాలంటే మరోసారి బడ్జెట్‌ ఆమోదం తీసుకోవాలి. ఖాతాలు తెరవాలి. అప్పుడే సమగ్ర ఆర్థిక నిర్వహణ సంస్థ వెబ్‌సైట్‌లో డ్రాయింగ్‌, డిస్‌బర్స్‌మెంట్‌ అధికారి ఉద్యోగుల జీతాలు, ఇతర భత్యాలు అప్లోడ్‌ చేయవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే జీతాల బిల్లులను ఆన్‌లైన్‌ పోర్టల్‌ అనుమతించబోదు. సమస్య త్వరలోనే పరిష్కారమై వచ్చే నెలలో పెరిగిన కొత్త వేతనాలు ఉద్యోగులు అందుకునేలా చర్యలు తీసుకుంటున్నామని ఖజానా శాఖ అధికారులు చెప్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details