విజయవాడ స్వరాజ్ మైదానంలో బుధవారం అంబేడ్కర్ విగ్రహ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి విశ్వరూప్ స్పష్టం చేశారు. ఏడాదిలోగా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. స్వరాజ్ మైదానం పరిధిలోని 25 ఎకరాలను ఉద్యానవనంగా మార్చటంతోపాటు... మైదానానికి అంబేడ్కర్ పేరు పెడతామని స్పష్టం చేశారు.
'స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం... ఏడాదిలోగా పూర్తి' - స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం
విజయవాడ స్వరాజ్ మైదానంలో బుధవారం ముఖ్యమంత్రి జగన్...అంబేడ్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేస్తారని మంత్రి విశ్వరూప్ స్పష్టం చేశారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహ నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని వెల్లడించారు.

'స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం... ఏడాదిలోగా పూర్తి'
నీటిపారుదలశాఖ నుంచి స్వరాజ్ మైదానాన్ని సాంఘికసంక్షేమశాఖకు మార్చామన్నారు. గతప్రభుత్వం అంబేడ్కర్ స్మృతివనం పేరుతో విగ్రహం ఏర్పాటుకు అమరావతి ప్రాంతంలోని మారుమూల గ్రామాన్ని ఎంపిక చేసిందన్నారు. గ్రాఫిక్స్‌తో హడావిడి చేశారే తప్ప ఎక్కడా పనులు ప్రారంభించలేదని దుయ్యబట్టారు.