భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్130 వ జయంతిని మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. డీజీపీ గౌతం సవాంగ్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అంబేడ్కర్ సామాజిక అంశాలపై నిశిత దృష్టి కలిగిన నేత అని డీజీపీ అన్నారు. భారత రాజ్యాంగాన్ని తయారు చేయటంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్స్ అడిషనల్ డీజీ శంకరబాత్ర బగ్చి, టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ పాలరాజు. లా అండ్ ఆర్డర్ డీఐజీ రాజశేఖర్ బాబు, దిశ స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.