ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 5, 2021, 7:12 PM IST

ETV Bharat / city

Annamayya Dam: కేంద్రబృందం ఏం చెప్పిందో.. కేంద్రమంత్రి తెలుసుకోవాలి: అంబటి

Annamayya Dam: అన్నమయ్య డ్యాం తెగడంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ చెప్పింది వాస్తవం కాదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. కేంద్ర బృందం వచ్చి రాష్ట్రంలో పర్యటించి ఏం చెప్పిందో షెకావత్ తెలుసుకోవాలని సూచించారు. అన్నమయ్య డ్యాం తెగడంపై న్యాయ విచారణ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

అంబటి రాంబాబు
అంబటి రాంబాబు

Annamayya Dam: కడప జిల్లాలో అన్నమయ్య డ్యాం తెగడంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ చెప్పింది వాస్తవం కాదని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు వాయిస్​ను పార్లమెంట్​లో వినిపించే ప్రయత్నం చేశారని విమర్శించారు. కేంద్ర బృందం వచ్చి రాష్ట్రంలో పర్యటించి ఏం చెప్పిందో షెకావత్ తెలుసుకోవాలని సూచించారు.

అన్నమయ్య డ్యాం తెగడంపై న్యాయ విచారణ చేయాల్సిన అవసరం లేదన్న రాంబాబు.. ఇందులో మానవ తప్పిదం లేదన్నారు. భారీ వర్షాలు పడటం వల్లే డ్యాం తెగిందన్నారు. నిజాలు తెలుసుకుని మాట్లాడాల్సిన బాధ్యత కేంద్ర మంత్రికి, రాష్ట్రంలో ప్రతిపక్షానికి ఉంటుందన్నారు.

మానవ తప్పిదంగా చిత్రీకరించి ప్రభుత్వంపై బురదజల్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో అధికారుల పనితీరు ప్రశంసనీయమని కేంద్ర బృందం తెలిపిందన్నారు. వరదలను చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్న ఆయన.. వికృత క్రీడ ఆడుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే గృహ వినియోగదారుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని చంద్రబాబు అంటున్నారని, మరి, తెదేపా అధికారంలో ఉన్నప్పుడు గృహ లబ్దిదారులకు రుణాల మొత్తాన్ని ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

Road accident in chittoor district: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details