సీఎం జగన్ 20 నెలల అద్భుత పాలనకు పురపాలక ఎన్నికల ఫలితాలే నిదర్శనమని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రజలు తీర్పు ఇచ్చారని వెల్లడించారు. సాధారణ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు. రాష్ట్రంలో తెదేపా భూస్థాపితమైందని..,భవిష్యత్తులో ఆ పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఎదురవుతుందన్నారు.
'సీఎం జగన్ అద్భుత పాలనకు ఎన్నికల ఫలితాలే నిదర్శనం' - అంబటి రాంబాబు తాజా వార్తలు
వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి పురపాలక ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబంటి రాంబాబు స్పష్టం చేశారు. సీఎం జగన్ 20 నెలల అద్భుత పాలనకు పురపాలక ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు.
సీఎం జగన్ అద్భుత పాలనకు ఎన్నికల ఫలితాలే నిదర్శనం
విశాఖ, గుంటూరు, విజయవాడలోనూ ప్రజలు వైకాపా అభ్యర్థులకు మద్దతు పలికారన్నారు. తద్వారా అక్కడి ప్రజలు మూడు రాజధానులకు మద్దతుగా ఉన్న విషయం తేటతెల్లమైందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నడిపిస్తోన్న రాజధాని ఉద్యమాలను మానుకోవటం మంచిదని సలహా ఇచ్చారు. వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృమవుతాయని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీచదవండి: వైకాపాకు ఓటెయ్యకపోతే.. సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరించారు: పవన్