రాజధాని రాకముందే చంద్రబాబు సహా తెదేపా నేతలు 4 వేల 75 ఎకరాలు బినామీ పేర్లతో భూములు కొని.. ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసి పెద్దఎత్తున భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. విచారణ తర్వాత అనిశా కూడా ఆధారాలతో సహా ఇదే విషయం చెబుతుందన్నారు. విచారణ తర్వాత ఆశ్చర్యకరమైన విషయాలను ప్రభుత్వం బయటపెడుతుందన్నారు. ఫైబర్ నెట్లోనూ లోకేశ్ బినామీ పేరిట రూ.2 వేల కోట్లకు పైగా అక్రమాలు జరిగాయన్నారు.
సీబీఐ విచారణకు సిద్ధమని చంద్రబాబు ప్రకటించాలి: అంబటి - అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ తాజా వార్తలు
తెదేపా అధినేత చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే అమరావతి భూములపై సీబీఐ విచారణకు సిద్ధమని 24 గంటల్లో చంద్రబాబు ప్రకటించాలని వైకాపా డిమాండ్ చేసింది. అలా ప్రకటిస్తేనే దోషులు కారని.. లేదంటే మీరే బడా దొంగలుగా ప్రజలు భావిస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు.
ambati rambabu on amaravthi inside trading
రాజధాని భూములు సహా ఫైబర్ నెట్‌పై సీబీఐ విచారణ జరపాలని వైకాపా ఎంపీలంతా కేంద్రాన్ని కోరతారని అంబటి రాంబాబు తెలిపారు. విచారణ చేస్తేనే అక్రమాలు బయటపడి దోషులకు శిక్ష పడుతుందన్నారు. అమరావతిపై విచారణ అంటే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదన్న అంబటి.. ఇప్పటికైనా విచారణను స్వాగతించాలన్నారు. డీజీపీపై హైకోర్టు చేసిన కామెంట్స్‌ను దురదృష్టకరంగా భావిస్తున్నామని.. దీనిపై తాము తిరిగి కామెంట్ చేయడం మర్యాదగా ఉండదని అంబటి వ్యాఖ్యానించారు.