ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మత్స్యకారుల అభ్యున్నతి కోసమే ఫిషింగ్ హార్బర్లు: అంబటి - అంబటి తాజా వార్తలు

మత్స్యకారుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అందుకోసమే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టారని తెలిపారు.

మత్స్యకారుల అభ్యున్నతి కోసమే ఫిషింగ్ హార్బర్లు
మత్స్యకారుల అభ్యున్నతి కోసమే ఫిషింగ్ హార్బర్లు

By

Published : Nov 21, 2020, 8:22 PM IST

మత్స్యకారుల ఆర్థిక, సామాజిక స్థితిగతులు ఇప్పటికీ దుర్భరంగానే ఉన్నాయని..అందుకే వైకాపా ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టిందని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. సముద్ర తీర ప్రాంతంలో 8 ఫిషింగ్ హార్బర్లను రూ.3 వేల కోట్లతో నిర్మించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకోవటం సంతోషదాయకమన్నారు.

మత్స్య సంపద స్థానిక వినియోగం కోసం ప్రతీ నియోజకవర్గంలోనూ ఆక్వా హబ్​లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బలహీనవర్గాల అభ్యున్నతికి వైకాపా ప్రభుత్వం కృషి చేస్తోందని...అందుకే వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అంబటి వెల్లడించారు. పాదయాత్రలో సీఎం జగన్ గుర్తించిన అంశాలను ఇప్పుడు అమలు చేస్తున్నారన్నారు.

ABOUT THE AUTHOR

...view details