'జగన్ గారూ... ఇకనైనా మీ నిర్ణయాలు మార్చుకోండి' - 'జగన్ గారు..ఇకనైనా మీ నిర్ణయాలు మార్చుకోండి'
ముఖ్యమంత్రి జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఉన్నతాధికారులు కోర్టులకెళ్లి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోందని మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు.
'జగన్ గారు..ఇకనైనా మీ నిర్ణయాలు మార్చుకోండి'
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య విజయమని మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఇప్పటికే 65 నిర్ణయాలను న్యాయస్థానం తప్పుపట్టినా.. ప్రభుత్వంలో తప్పుడు చర్యలపై సమీక్ష లేకపోవడం దురదృష్టకరమన్నారు. తాను చెప్పిందే జరగాలనే మూర్ఖత్వాన్ని జగన్ ఇకనైనా వీడనాడలని హితవు పలికారు. సీఎం జగన్ నిర్ణయాల వల్ల సీఎస్, డీజీపీ, ముఖ్య కార్యదర్శులు కూడా కోర్టుకెళ్లి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోందని దుయ్యబట్టారు.