తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నాయకులు విజయవాడలో ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ని కలిసి వినతిపత్రం అందజేశారు. రాజధాని అమరావతి ఉద్యమ కార్యక్రమాలను శైలజానాథ్కు జేఏసీ నేతలు వివరించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తొందని శైలజానాథ్ అన్నారు. రాజధాని అంశం రాజకీయ కక్షలకు వేదిక కాకూడదని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతోందన్నారు. ఏపీకి మూడు రాజధానులంటూ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని విభజించడం సరికాదని జేఏసీ నాయకులు శివారెడ్డి అన్నారు. రేపు రాజధాని రైతులతో కలిసి ఢిల్లీ వెళ్తున్నామని ...., ప్రధాని మోదీ, రాష్టప్రతిని కలిసి అమరావతిని పరిరక్షించాలని వారికి విన్నవిస్తామన్నారు. అనుమతి ఇస్తే సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా కలిసి అమరావతికి మద్దతు కోరతామన్నారు.
రాజధాని ఆంశం రాజకీయ కక్షలకు వేదిక కాకూడదు: శైలజానాథ్
మూడు రాజధానుల నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ అన్నారు. తమ ఉద్యమానికి మద్ధతు ఇవ్వాలని జేఏసీ నాయకులు ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్
TAGGED:
ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్