ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ డబ్బు కోసం పోరాడాల్సి వస్తోంది: అమరావతి జేఏసీ నేత బొప్పరాజు

AMARAVATI JAC: విజయవాడలో అమరావతి ఐకాస ఉద్యోగసంఘాల నేతలు భేటీ అయ్యారు. ఆర్థిక అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని అమరావతి ఐకాస ఉద్యోగసంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. రూ.3 వేల కోట్ల పీఎఫ్ డబ్బు కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. రూ.7 వేల కోట్ల డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు. పీఆర్‌సీ బకాయిలపై ఇంకా ప్రభుత్వ ఉత్తర్వు రాలేదని తెలిపారు.

AMARAVATI JAC
AMARAVATI JAC

By

Published : Aug 5, 2022, 10:48 PM IST

Employees Union Leaders on PF: ఉద్యోగుల ఆర్థికపరమైన అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వటం లేదని ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం ఆక్షేపించింది. ఉద్యోగులు దాచుకున్న 3 వేల కోట్ల రూపాయల జీపీఎఫ్ సొమ్మును తిరిగి పొందటం కోసం ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన రూ. 7 వేల కోట్ల డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని రెవెన్యూ భవన్​లో అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. 2018 జూలై ఒకటో తేదీ నుంచి రూ. 7 వేల కోట్ల డీఏ బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. పీఆర్సీ బకాయిలపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదని ఆక్షేపించారు.

కొత్త జిల్లాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఏపీ జేఏసీ అమరావతి ప్రధాన కార్యదర్శి వై.వీ.రావు ఆరోపించారు. జిల్లా కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు 16 శాతం హెచ్ఆర్ఏ చెల్లించాలని డిమాండ్ చేశారు. కొత్త జిల్లాల్లో ఆర్డర్ టు సర్వ్ కింద కేటాయించిన ఉద్యోగులకు తీవ్రమైన పని ఒత్తిడి పెరుగుతోందన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details