ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Amaravati farmer suicide attempt: అమరావతి రైతు ఆత్మహత్యాయత్నం.. - Amravati farmer suicide attempt at AMRDA Commissioner's Chamber

అమరావతి రాజధాని ప్రాంతానికి చెందిన ఓ రైతు.. ఏఎంఆర్డీఏ కమిషనర్ ఛాంబర్ ఎదుట డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నాని(Amaravati farmer suicide attempt at AMRDA Commissioner's Chamber)కి పాల్పడ్డారు. గత కొద్దిరోజులుగా ల్యాండ్ పూలింగ్​కు సంబందించిన బెనిఫిట్లు ఇవ్వకపోవడంపై మనస్తాపం చెందిన గుంటూరు జిల్లా ఐనవోలుకు చెందిన రైతు ఆత్మహత్యకు యత్నించారు.

Amaravati famers suicide attempt at amrda office
అమరావతి రైతు ఆత్మహత్యాయత్నం

By

Published : Oct 19, 2021, 4:29 AM IST

ఏఎంఆర్డీఏ కమిషనర్ ఛాంబర్(Amaravati farmer suicide attempt at AMRDA Commissioner's Chamber) ఎదుట అమరావతి ప్రాంతానికి చెందిన రైతు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ల్యాండ్ పూలింగ్​కు సంబందించిన బెనిఫిట్లు ఇవ్వడంలేదంటూ.. రాజధాని ప్రాంతానికి చెందిన సుబ్బారావు అనే రైతు.. ఏఎంఆర్డీఏ కమిషనర్ ఛాంబర్ ఎదుట డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి(Amravati farmer suicide attempt) పాల్పడ్డారు. అధికారుల ఫిర్యాదు మేరకు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న గవర్నర్​పేట పోలీసులు.. సుబ్బారావును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

గుంటూరు జిల్లా ఐనవోలు గ్రామానికి చెందిన రైతు సుబ్బారావుకు తుళ్లూరు మండలం మందడం గ్రామంలో పొలం ఉంది.ల్యాండ్ పూలింగ్​లో భాగంగా తన పొలాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన బెనిఫిట్లు రాకపోవడంతో కొద్ది రోజులుగా ఏఎంఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కాళ్లు అరిగేలా తిరిగిన ఫలితం లేకపోవడంతో మనస్తాపం చెందిన ఆయను.. రాత్రి 7 గంటల సమయంలో కార్యాలయానికి వెళ్లారు. ఏఎంఆర్డీఏ కమిషనర్ విజయకృష్ణన్ చాంబర్ ఎదుట డీజిల్ పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న గవర్నర్​పేట పోలీసులు.. హుటాహుటిన కార్యాలయంలోకి చేరుకున్నారు. సుబ్బారావును అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్​కు తరలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ.. ఏఎంఆర్డీఏ కమిషనర్ కార్యాలయ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details