విద్యార్థుల్లోని సృజన, నైపుణ్యాలను వెలికితీసే ఉద్దేశంతో ఎక్స్ప్లోర్ 2కే19 పోటీలు జరిపారు. అమరావతి బాలోత్సవం, యంగ్ బ్రెయిన్స్ వారి ఆధ్వర్యంలో విజయవాడ ఎంబీవీకే విజ్ఞాన కేంద్రంలో కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని పలు కళాశాలకు చెందిన విద్యార్థులు వేడుకలో పాల్గొని వివిధ విభాగాల్లో వారి ప్రతిభను కనబరిచారు. చర్చ, బృంద నృత్యాలు, టిక్ టాక్, ఫ్యాషన్ షో విభాగాల్లో విద్యార్థులు హుషారుగా పాల్గొన్నారు. వారసత్వ రాజకీయాలు, రాజకీయ నాయకులకు విద్యార్హతలు ఉండాలా? అనే అంశాలపై విద్యార్థులు తమ అభిప్రాయలను ఆలోచనాత్మకంగా వెల్లడించారు. విభాగాల వారీగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలతో పాటు పురస్కారాలు ప్రదానం చేశారు.
విజయవాడలో సందడిగా ఎక్స్ప్లోర్ 2కే 19 పోటీలు - విజయవాడలో ఎక్స్ప్లోర్ 2019 పోటీలు నిర్వహణ
విజయవాడ ఎంబీవీకే విజ్ఞాన కేంద్రంలో ఎక్స్ప్లోర్ 2కే19 పోటీలు జరిగాయి. అమరావతి బాలోత్సవం, యంగ్ బ్రెయిన్స్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. పలు విభాగాల్లో విద్యార్థులు ప్రతిభ చాటారు.

విజయవాడలో ఎక్స్ప్లోర్ 2కే19 పోటీలు నిర్వహణ
విజయవాడలో ఎక్స్ప్లోర్ 2కే19 పోటీలు నిర్వహణ
ఇదీ చదవండి: