ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతిపై సర్కారు కీలక నిర్ణయం.. నగరపాలక సంస్థగా మార్చనున్నట్టు ప్రకటన! - Amravati capital region

Amaravathi Capital area: రాజధాని ప్రాంతం అమరావతిని.. మునిసిపల్ కార్పొరేషన్‌గా మార్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలోని 19 గ్రామాలను కలిపి కార్పొరేషన్‌గా మార్చనున్నట్లు ప్రకటించింది.

నగరపాలక సంస్థగా రాజధాని ప్రాంతం

By

Published : Jan 3, 2022, 4:12 PM IST

Updated : Jan 3, 2022, 7:30 PM IST

Amaravathi Capital Area: అమరావతి రాజధాని ప్రాంతంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతాన్ని నగరపాలక సంస్థగా మార్చేందుకు చర్యలు చేపట్టింది. అమరావతి క్యాపిటల్ సిటీని.. కార్పొరేషన్‌గా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. రాజధానిలోని 19 గ్రామాలను కలిపి కార్పొరేషన్‌గా మార్చనున్నట్లు ప్రకటించింది.

ఇందులో భాగంగా.. ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమైంది. ఈ మేరకు గుంటూరు కలెక్టర్ గ్రామసభల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశారు. తుళ్లూరులోని 16, మంగళగిరిలోని 3 గ్రామాల్లో సభలు జరపాలని ఆదేశించారు. గ్రామసభల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఈనెల 6 నుంచి గ్రామ సభలు నిర్వహించి ఈనెల 12 లోగా ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశాలిచ్చారు.

ప్రభుత్వ నిర్ణయం సరికాదు: అమరావతి ఐకాస

ప్రభుత్వ నిర్ణయం సరికాదు: అమరావతి ఐకాస
19 గ్రామాలతో అమరావతి క్యాపిటల్ సిటీ కార్పొరేషన్‌ ఏర్పాటును.. రాజధాని ఐకాస తప్పుపట్టింది. 19 గ్రామాలతోనే కార్పొరేషన్ ఏర్పాటు సరికాదని ఐకాస నేత పువ్వాడ సుధాకర్ అన్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాలను అమరావతి కార్పొరేషన్‌లోనే ఉంచాలని డిమాండ్ చేశారు. సీఆర్డీఏలోని 29 గ్రామాలను కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సభల్లో తమ అభిప్రాయాలను స్పష్టంగా చెబుతామని పువ్వాడ సుధాకర్‌ తెలిపారు.

ఇదీ చదవండి :

Construction Works in Amaravati: అమరావతిలో మళ్లీ పనులు.. ప్రయత్నాల్లో సీఆర్డీఏ!

Last Updated : Jan 3, 2022, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details