విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అమరావతి ఐకాస తృతీయ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున హాజరయ్యాయి. లెనిన్ సెంటర్ నుంచి కళా క్షేత్రం వరకు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో వీలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అమరావతి ఐకాస ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. అన్ని రంగాల ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తామని తెలిపారు. రాజధానిని తరలిస్తే ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలపై ముఖ్యమంత్రి... తమను పిలిపించి చర్చించే విధంగా తీర్మానం చేస్తామని చెప్పారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై అమరావతి ఐకాస హర్షం - విజయవాడలో తృతీయ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో.. అమరావతి ఐకాస తృతీయ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది. 94 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ర్యాలీ నిర్వహించాయి.
మరావతి ఐకాస ఆధ్వర్యంలో 94 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ర్యాలీ