రాజధాని రైతులకు మద్దతుగా అమరావతి ఐకాస ఆధ్వర్యంలో విజయవాడలో ర్యాలీ జరిగింది. చల్లపల్లి బంగ్లా నుంచి ఎస్ఆర్ఆర్ కళాశాల వరకూ నిర్వహించిన ర్యాలీలో పెద్దసంఖ్యలో నగరవాసులు, తెదేపా నేతలు పాల్గొన్నారు. రాజధాని అభివృద్ధి కోసం రైతులు ఇచ్చిన భూమిని పేదలకు పంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం అన్యాయమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉండగా ఉత్తర్వులు ఎలా జారీ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దని మహిళలు, నగరవాసులు నినాదాలు చేశారు. ప్రభుత్వం రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని, మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అమరావతికి మద్దతుగా విజయవాడలో ర్యాలీ - amaravathi jac rally at vijayawada
రాజధాని అభివృద్ధి కోసం రైతులు ఇచ్చిన భూమిని పేదలకు పంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయటం అన్యాయమని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అమరావతిలో రైతులకు మద్దతుగా అమరావతి ఐకాస ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
![అమరావతికి మద్దతుగా విజయవాడలో ర్యాలీ amaravathi jac rally at vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6199523-717-6199523-1582633160272.jpg)
అమరావతికి మద్దతుగా విజయవాడలో ర్యాలీ