అమరావతి రాజధాని కోసం నాడు రైతులు భూములిస్తే... నేడు పాలకులు భూముల కోసం రాజధానులు మారుస్తుండడం దేశంలో మరెక్కడా జరిగి ఉండబోదని అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు ఆరోపించారు. విజయవాడలో సమావేశంలో మాట్లాడిన సమితి ప్రతినిధులు.. విశ్రాంత ఐఏఎస్ అధికారి జీఎన్‌రావు నివేదికకు స్వల్ప మార్పులతో జెరాక్స్ కాపీగానే బీసీజీ గ్రూపు నివేదిక ఉందని విమర్శించారు. దొండపాడు గ్రామానికి చెందిన రైతు మనోవేదనతో చనిపోవడంపై దిగ్భ్రాంతి తెలిపారు. వందేళ్ల వరకూ ఇప్పటి వరకూ అమరావతిలో వరదలు వచ్చిన సందర్భాలు లేవని అన్నారు. కానీ కర్నూలు ముంపునకు గురి కావడం ఈ మధ్యనే చూశామని పేర్కొన్నారు. విశాఖలో హుద్‌హుద్ విలయం ఇంకా అక్కడి ప్రజలు మరచిపోలేదని వివరించారు. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చి.. దాన్ని అమలు చేయించేందుకే కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని ధ్వజమెత్తారు. పలు సంఘాల మద్దతుతో అమరావతి పరిరక్షణ కోసం ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
'భూముల ధరలు పెంచుకునేందుకే రాజధాని విశాఖకు తరలిస్తున్నారు' - అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు తీర్మానాలు
ప్రభుత్వం దురుద్దేశంతోనే రాజధాని మార్పు చేస్తోందని అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు ఆరోపించారు. బీసీజీ కమిటీ నివేదిక.. జీఎన్‌రావు కమిటీ నివేదికకు కాపీగానే ఉందని ధ్వజమెత్తారు. ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా సర్కారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. అమరావతి పరిరక్షణకు ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
'భూముల ధరలు పెంచుకునేందుకే రాజధాని విశాఖకు తరలిస్తున్నారు'