కరోనాతో పదుల సంఖ్యలో ఉద్యోగులు మరణించారని బొప్పరాజు అన్నారు. వర్క్ ఫ్రం హోమ్ కోసం ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చామని.. అయినా స్పందన లేదన్నారు. మరణించిన ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు రూ.50 లక్షలు పరిహారం ఇవ్వలేదని బొప్పరాజు పేర్కొన్నారు. కరోనా బారిన పడిన ఉద్యోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు ఉంచాలన్నారు. ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని సీఎం ప్రకటించడాన్ని హర్షిస్తున్నామని బొప్పరాజు అన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.
వర్క్ ఫ్రం హోమ్ కోసం వినతిపత్రం ఇచ్చాం.. స్పందన లేదు: బొప్పరాజు - కరోనాపై అమరావతి జేఏసీ కామెంట్స్
కరోనా ఉద్ధృతి పెరుగుతోందని ఏపీ ఐకాస ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. భయాందోళన మధ్య ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు.

amaravathi jac on corona effect