అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... విజయవాడ ధర్నా చౌక్‌లో అమరావతి పరిరక్షణ సమితి నిరసన చేపట్టింది. ఈ ధర్నాలో క్రీడాకారులు, క్రీడా సంఘాలు, ప్రజా సంఘాలు , వైద్యులు పాల్గొన్నారు. 'మూడు రాజధానులు వద్దు... అమరావతి ముద్దు' అనే నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో తెదేపా మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని సంఘీభావం తెలిపారు. లక్షకోట్లు ఖర్చు అవుతుందని అవాస్తవాలు చెప్తూ... రాజధానిని తరలించాలని ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూ స్పష్టమైన ప్రకటన చేసే వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
అప్పటివరకు ఆందోళనలు ఆగవు: బొండా - విజయవాడలో అమరావతి ఐకాస ధర్నా
మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ... అమరావతి పరిరక్షణ సమితి నిరసన చేపట్టింది. ఈ ధర్నాలో క్రీడా సంఘాలు, ప్రజా సంఘాలు, వైద్య సంఘాలు పాల్గొన్నాయి.
విజయవాడలో అమరావతి ఐకాస ధర్నా