రాజధాని అమరావతి కోసం 300వ రోజు ఉద్యమాన్ని 2రోజుల పాటు నిర్వహించాలని... అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించింది. 11వ తేదీ ఉదయం అమరావతి పరిరక్షణ ర్యాలీ నిర్వహించటంతో పాటు మహిళలతో వెబినార్ నిర్వహించనున్నారు. 12వ తేదీ 300వ రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని రెవెన్యూ కార్యాలయాల ముందు నిరసన దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు.
'300వ రోజు ఉద్యమం.. 2 రోజులు ఉద్ధృతంగా నిర్వహిస్తాం' - Amaravathi Farmers Protest news
300వ రోజు ఉద్యమాన్ని 2రోజుల పాటు నిర్వహించాలని అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించింది. విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వైకాపా మినహా వివిధ రాజకీయ పార్టీలు పాల్గొన్ని ఉద్యమ కార్యాచరణకు మద్దతు తెలిపాయి.
అమరావతి పరిరక్షణ సమితి
వైకాపా మినహా అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాల మద్దతుతో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించనున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి ప్రకటించింది. విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వైకాపా మినహా వివిధ రాజకీయ పార్టీలు పాల్గొన్ని ఉద్యమ కార్యాచరణకు మద్దతు తెలిపాయి.
ఇదీ చదవండీ... మంత్రి జయరాం భూదందాకు పాల్పడ్డారు: అయ్యన్నపాత్రుడు