ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే భూసేకరణకు 100 కోట్లు - అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే

అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టు భూసేకరణ నిధుల విడుదలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. భూసేకరణ కోసం రూ. 100 కోట్లు విడుదలకు ప్రభుత్వ పాలనానుమతులు జారీ చేసింది. భూసేకరణకు రూ.2,230 కోట్లు ఖర్చవుతుందని కేంద్రం అంచనా వేయగా...ప్రాజెక్టుకు ప్రభుత్వ భూమి ఉచితంగా ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.

అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే
అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే

By

Published : Sep 28, 2020, 10:38 PM IST

అమరావతి - అనంతపురం ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ కింద 100 కోట్లు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలనానుమతులు జారీ చేసింది. ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టు నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా 2020-21 ఆర్ధిక సంవత్సరానికిగానూ జాతీయ రహదారుల సంస్థ ప్రాంతీయ అధికారికి ఈ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశాలిచ్చింది.భూసేకరణకు మొత్తంగా 2230 కోట్ల మేర ఖర్చవుతుందని కేంద్ర ఉపరితల రవాణాశాఖ అంచనా వేసింది. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ భూమిని ఉచితంగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారాన్ని తెలియచేసింది. అదనంగా చేసే భూసేకరణ ఖర్చులో 50శాతం మేర భరించేందుకు కూడా సమ్మతించింది. ఈ మేరకు రహదారులు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details