భారత్ సాధించిన విజయాలను విజయవాడలో ప్రస్తావిస్తున్న జీవీఎల్ నరసింహారావు ప్రపంచమంతా భారత్ వైపు, ప్రధాని మోదీ అమలు చేస్తున్న చర్యలవైపే చూస్తోందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు విజయవాడలో అన్నారు.దౌత్య రంగంలో భారత్ ఎన్నో విజయాలు సాధించిందని చెప్పారు. సైన్యం చేసిన మెరుపు దాడులు చరిత్రలో నిలిచిపోతాయని, పెద్దసంఖ్యలో తీవ్రవాదులను మట్టుబెట్టింది ఒక్క భారతేనని అన్నారు. పాక్ మెడలు వంచి రెండు రోజుల్లోనే వింగ్ కమాండర్ అభినందన్‌ను తీసుకొచ్చామని, దేశమంతా మోదీని, సైన్యాన్ని కొనియాడుతోందని చెప్పారు.