ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Kapu Federation: 'ఓ సామాజిక వర్గాన్ని కించపరచటం తగదు' - Kapu Federation react on misiter perineni nani comments

కాపు సామాజిక వర్గానికి పేర్ని నాని చేసిన సంక్షేమ కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆలిండియా కాపు ఫెడరేషన్ విజయవాడ నగర అధ్యక్షుడు తారక రామారావు డిమాండ్​ చేశారు. కాపు సామాజిక వర్గానికి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా కాపులను కించపరిచేలా మాట్లాడం సరికాదన్నారు.

Kapu Federation
కాపు ఫెడరేషన్

By

Published : Sep 28, 2021, 5:58 PM IST

రాష్ట్ర మంత్రి పేర్ని నాని కాపు సామాజిక వర్గంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆలిండియా కాపు ఫెడరేషన్ విజయవాడ నగర అధ్యక్షుడు తారక రామారావు తెలిపారు. అధికారంలోకి వచ్చాక కాపు సామాజిక వర్గానికి వైకాపా చేసిన సంక్షేమ కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. కాపులను కించపరిచేలా మాట్లాడటం పేర్ని నానికి తగదని కాపు ఫెడరేషన్ నాయకులు హెచ్చరించారు.

పవన్​ కల్యాణ్​ చేసిన వ్యాఖ్యలకు స్పందించి తిరిగి ఆయనపై ఎదురుదాడి చేసుకోవాలే.. కానీ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయటం బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్న పేర్ని నానికి తగదన్నారు. మున్ముందు రోజుల్లో ఇదేవిధంగా వ్యాఖ్యలు చేస్తే తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని కాపు ఫెడరేషన్ నాయకులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ.. న్యాయం చేయాలంటూ మహిళ నిరసన..తహసీల్దారు కార్యాలయానికి తాళం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details