ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ... నిరసన - Banks Merge

బ్యాంకుల విలీనం కారణంగా ప్రజలు నష్టపోతారని... ప్రైవేటీకరణ చేసి కార్పోరేట్ రంగానికి కట్టబెట్టేందుకే ఇదంతా చేస్తున్నారని... అలహాబాద్ బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ బాధ్యులు ఆరోపించారు. విజయవాడలో నిరసన చేపట్టారు.

బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ... నిరసన

By

Published : Sep 15, 2019, 9:46 PM IST

బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ... నిరసన

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బ్యాంకుల విలీనం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... విజయవాడలో అలహాబాద్ బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బ్యాంకులు విలీనం చేయడం కారణంగా ప్రజలు నష్టపోతారని... ప్రైవేటీకరణ చేసి కార్పోరేట్ రంగానికి కట్టబెట్టేందుకే ఇదంతా చేస్తున్నారని... ఆరోపించారు. బ్యాంకులకు రావాల్సిన నిరవధిక ఆస్తుల వసూళ్లపై కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడం కారణంగానే నష్టాల వస్తున్నాయని వివరించారు.

బ్యాంకుల విలీన ప్రక్రియ అపకపోతే... ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చారించారు. విలీన రద్దు కోరుతూ... తమ కార్యచరణ ప్రకటించారు. ఈ నెల 27,28 తేదీల్లో బ్యాంకులన్నీ సమ్మెలో పాల్గొంటాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే నవంబర్ రెండో వారం నుంచి దేశంలోని బ్యాంకులన్ని సమష్టిగా ఆందోళనకు దిగుతాయని హెచ్చరించారు. తర్వాత వచ్చే సంక్షోభానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details