ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రతి బోధనాసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్: మంత్రి ఆళ్ల నాని - కరోనా వార్తలు

రాష్ట్రంలోని బోధనాసుపత్రిల్లో ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్లాంట్లలో ఆక్సిజన్ నిల్వ పెంపుపై సమీక్షించారు.

alla nanai review on oxygen supplies
ఆక్సిజన్ నిల్వ, నిరంతర సరఫరాపై ఆళ్ల నాని సమీక్ష

By

Published : May 19, 2021, 7:08 AM IST

రాష్ట్రంలోని ప్రతీ బోధనాసుపత్రిలోనూ కనీసం 3 కిలో లీటర్ల ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని.. మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కరోనా రోగులకు ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి సారించామన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో వైద్యారోగ్య శాఖ, కొవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారులతో.. సమీక్ష నిర్వహించారు.

కృష్ణపట్నం, శ్రీసిటీ, కడప స్టీల్ ప్లాంట్, జిందాల్ స్టీల్ ప్లాంట్ లో ఆక్సిజన్ స్టోరేజ్ ల పెంపుపై మరింత దృష్టి సారించాలని ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితిని అధిగమించడానికి 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అవసం ఉంటుందన్నారు. ఆక్సిజన్ సరఫరా చేసే 11 ప్లాంట్లను మ్యాపింగ్ చేసి అక్కడ నుంచి ఎటువంటి అవరోధాలు లేకుండా నిరంతరం ఆక్సిజన్ రవాణా జరగడానికి కూడ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details