అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ 2017 నవంబరులో చేపట్టిన 'ఛలో వెలగపూడి' కార్యక్రమంపై నమోదైన కేసులో.. అఖిలపక్ష నాయకులు విజయవాడ జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు విచారణను న్యాయస్థానం డిసెంబర్ 9కి వాయిదా వేసింది. తమపై ఎన్ని కేసులు పెట్టినా అగ్రిగోల్డ్ బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగేవరకూ పోరాటం చేస్తామని నేతలు స్పష్టంచేశారు. బాధితుల కోసం రాష్ట్రప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టిన రూ.1,150 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. వచ్చేనెల 18,19 తేదీల్లో విజయవాడలో 36 గంటల నిరసన దీక్ష చేపడుతున్నట్లు వెల్లడించారు.
'అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకూ మా పోరాటం ఆగదు' - అగ్రిగోల్డ్ కేసులో విజయవాడ కోర్టుకు అఖిలపక్ష నేతలు
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేవరకూ తమ పోరాటం ఆగదని అఖిలపక్ష నాయకులు స్పష్టంచేశారు. ఛలో వెలగపూడి కార్యక్రమంపై నమోదైన కేసులో విజయవాడ కోర్టుకు హాజరయ్యారు.
విజయవాడ కోర్టుకు అఖిలపక్ష నాయకులు