ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఇదే మంచి సమయం.. ప్రత్యేక హోదా సాధనకు జగన్ కృషి చేయాలి' - ప్రత్యేక హోదా తాజా వార్తలు

All parties, experts on Special Status: రాష్ట్రపతి ఎన్నికలను అవకాశంగా చేసుకుని ప్రత్యేక హోదా సాధనకు ముఖ్యమంత్రి జగన్ కృషి చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అలాగే విభజన హామీలు నెరవేర్చాల్సిందిగా పట్టుబట్టాలని ఆయా సంఘాల నేతలు సూచించారు. కేంద్రంపై పోరాటంలో విపక్షాలను కూడా కలుపుకొని వెళ్లాలన్నారు.

ప్రత్యేక హోదా సాధననకు జగన్ కృషి చేయాలి
ప్రత్యేక హోదా సాధననకు జగన్ కృషి చేయాలి

By

Published : Jun 21, 2022, 5:22 PM IST

President Election: రాష్ట్రపతి ఎన్నికలను అవకాశంగా చేసుకుని ప్రత్యేక హోదా సాధనకు ముఖ్యమంత్రి జగన్ కృషి చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. వచ్చే నెల ప్రధాని రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో అధికార పార్టీ సహా అన్నిపక్షాలూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యమించాలని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి డిమాండ్‌ చేసింది. హోదా అంశాన్ని విస్మరిస్తూ.. వైకాపా సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని సమితి నేతలు మండిపడ్డారు.

ప్రత్యేక హోదాపై మడమ తిప్పనని ప్రకటించిన సీఎం జగన్‌ ఇప్పుడు ఏం చేస్తున్నారని నిలదీశారు. తెలంగాణ రాజకీయ పార్టీల నేతలందరూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించారని గుర్తు చేశారు. జులై నెలాఖరు నుంచి ప్రత్యేక హోదా కోసం బస్సు యాత్ర చేపడతామని సాధన సమితి స్పష్టం చేసింది. ఇందుకు త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించింది.

ప్రత్యేక హోదా సాధననకు జగన్ కృషి చేయాలి

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details