కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త నిరసనలో భాగంగా విజయవాడ ధర్నా ఛౌక్ వద్ద అన్ని కార్మిక సంఘాలు నిరసన ర్యాలీ చేపట్టాయి. కరోనా కాలంలో ఉపాధి కోల్పోయిన కార్మికులందరికీ రూ.15 వేలు ఇవ్వాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. పనిగంటల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. అలాగే ఉద్యోగుల జీతాల్లో కోతలు సరికాదని అన్నారు. రైల్వేలో ప్రైవేటు రంగాల పెట్టుబడుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.
అయితే కార్మిక సంఘాల ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు వీరిని అడ్డుకున్నారు. కార్మిక సంఘాల నేతలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.