స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తెదేపా విడుదల చేసిన మేనిఫెస్టో తప్పన్నట్లు వైకాపా నేతలు మాట్లాడుతున్నారని.. మాజీమంత్రి ఆలపాటి రాజా మండిపడ్డారు. స్థానిక సంస్థలకు మేనిఫెస్టో విడుదల కొత్త సంప్రదాయమేమీ కాదన్నారు. పార్టీ గుర్తు లేకపోయినా.. పార్టీలు బలపరిచే అభ్యర్థులే ఎన్నికల్లో పోటీ చేస్తారని వెల్లడించారు. మంచి వ్యక్తులను ఎన్నుకోవాలనే మేనిఫెస్టో ద్వారా పిలుపునిచ్చామన్నారు. అధికారంలో ఉన్న పార్టీ ప్రజలకు ఏం చేయలేకపోతున్నందునే స్వయం పాలన కోసం తెదేపా అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలు వివరిస్తారని తెలిపారు.
'పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో కొత్త సంప్రదాయమేమీ కాదు' - తెదేపా మేనిఫెస్టోపై ఆలపాటి కామెంట్స్
స్థానిక సంస్థల ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల కొత్త సంప్రదాయమేమీ కాదని మాజీమంత్రి ఆలపాటి రాజా పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు తెదేపా విడుదల చేసిన మేనిఫెస్టో తప్పన్నట్లు వైకాపా నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
'పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో కొత్త సంప్రదాయమేమీ కాదు'