ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడ సంగీత కళాశాలలో అఖండ కచ్ఛపి మహోత్సవం - Kachchapi Mahotsavam at Vijayawada Music College news

వీణ తంత్రులు వినసొంపుగా ప్రతిధ్వనించాయి. వైణికులంతా ఒకచోట చేరి.. శారదాదేవికి సంగీతార్చన చేశారు. వీణా వాద్య వైభవాన్ని కళ్లకు కట్టారు.

Akhanda Kachchapi Mahotsavam at Vijayawada Music College
విజయవాడ సంగీత కళాశాలలో అఖండ కచ్ఛపి మహోత్సవం

By

Published : Feb 16, 2021, 7:42 AM IST

గంటల అఖండ కచ్ఛపీ మహోత్సవంతో.. విజయవాడలో జరిగిన వీణా యజ్ఞం సంగీతాభిమానులను అలరించింది. సంగీత కళాశాల ప్రాంగణం వేదికగా శ్రీ సుబ్రహ్మణ్య మహతి సంగీత సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 50 మంది వైణికులు తమ వీణా నైపుణ్య చాతుర్యం ప్రదర్శించారు.

12 గంటల అఖండ కచ్ఛపీ మహోత్సవం

సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ సంగీత యజ్ఞం... లయబద్ధంగా సాగింది. ఒక్కొక్కరూ 20 నిమిషాల చొప్పున వీణానాదంతో శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేశారు. సుప్రసిద్ధత విద్వాంసులు తంత్రులను శృతి మధురంగా మీటుతూ శారదా దేవికి సంగీతార్చన చేశారు.

అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన తెలుగు వైణిక విద్వాంసుల్ని స్మరించుకుంటూ.. ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఇంతమంది ఒకచోటకు చేరి సరస్వతీ దేవికి వీణార్చన జరిపిన కార్యక్రమం దేశంలోమరెక్కడా జరగలేదని కళాకారులు చెప్పారు.

ఇదీ చదవండి:

ఓటేయలేదని మెట్లు కూల్చివేత... గుంటూరు జిల్లాలో ఘటన

ABOUT THE AUTHOR

...view details