ఆహార పదార్ధాల్లో కల్తీని అరికట్టాలని కోరుతూ ఈ నెల 23వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు తెలిపారు. విజయవాడ దాసరి భవన్లో ఆయన వివరాలు వెల్లడించారు. కల్తీ ఆహారం వలన నేటి బాలలే రేపటి రోగులుగా, ప్రజలంతా అనారోగాల బారిన పడాల్సిన దుస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలపై అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆహార భద్రతాధికారుల పోస్టులు భర్తీ చేసి కల్తీని అరికట్టాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న మీ సేవ కేంద్రాల ద్వారా 9 వేల మంది స్వయం ఉపాధి పొందుతున్నారని, అక్రమాలు జరుగుతున్నాయనే సాకుతో మీసేవ కేంద్రాలను రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మీసేవలను గ్రామ సచివాలయాలకు అనుసంధానం చేయడం వలన మీసేవ నిర్వాహకులు ఉపాధి కోల్పోతున్నారని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి కొనసాగించాలని డిమాండ్ చేశారు.
23న కలెక్టరేట్ల వద్ద ఏఐవైఎఫ్ ఆందోళన
ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన కలెక్టరేట్ల వద్ద ఆందోళన నిర్వహించనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు తెలిపారు.
23న రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ఏఐవైఎఫ్ల ధర్నా