ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ధర్నా చౌక్​లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మహా ధర్నా - ap latest news

AITUC dharna at Vijayawada: ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు- ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు.. విజయవాడలోని ధర్నాచౌక్​లో మహాధర్నా చేపట్టారు. వారికి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

AITUC dharna at vijayawada dharnachowk
ధర్నా చౌక్​లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మహా ధర్నా

By

Published : Feb 19, 2022, 6:07 PM IST


AITUC dharna at Vijayawada: ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు- ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ.. అన్ని శాఖల్లోని ఉద్యోగులు, కార్మికులు విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా చేపట్టారు.

ధర్నా చౌక్​లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మహా ధర్నా

కోతలు లేని పీఆర్సీని అమలు చేయాలని.. వేతనాలు సకాలంలో చెల్లించాలని.. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను.. వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లోగా.. కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే.. చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details