ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Agrigold: "వారంలోగా న్యాయం చేస్తామన్న జగన్​... ఇప్పటికీ పట్టించుకోవడంలేదు" - ఏపీ తాజా వార్తలు

Agrigold Victims Protest: ఇచ్చిన హామీని సీఎం జగన్‌ వెంటనే నెలబెట్టుకోవాలంటూ విజయవాడ ధర్నా చౌక్‌లో అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన చేపట్టారు. అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆక్రందన సభ నిర్వహించారు. అధికారం చేపట్టిన వారంలోగా న్యాయం చేస్తామని చెప్పిన జగన్‌ ఇప్పటికీ పట్టించుకోడడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Agrigold Victims Protest
అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన

By

Published : Sep 6, 2022, 1:47 PM IST

Agrigold Victims Protest: సాయం కోసం నిరీక్షిస్తూ ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు మళ్లీ రోడ్డుఎక్కక తప్పలేదు. వివిధ జిల్లాల నుంచి విజయవాడ వచ్చిన అగ్రిగోల్డ్‌ బాధితులు విజయవాడ ధర్నాచౌక్‌లో న్యాయం కోసం గొంతెత్తారు. అధికారంలోకి రాకముందు సీఎం జగన్‌ తమకిచ్చిన హామీలన్నీ ప్రస్తుతం నీటమూటలే అయ్యాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన బాధిత కుటుంబాలకు 10 లక్షలు సాయం చేస్తామని చెప్పి...పట్టించుకోవడం లేదన్నారు.ఇప్పటికైనా న్యాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

అగ్రిగోల్డ్ బాధితుల తరపున మొదటినుంచీ పోరాడుతున్న సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వర్రావు... ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. బాధితులకు ప్రభుత్వం వెంటన న్యాయం చేయాలని సీపీఐ, లోక్‌సత్తా పార్టీలు డిమాండ్‌ చేశాయి. వివిధ జిల్లాల నుంచి విజయవాడ వచ్చిన అగ్రిగోల్డ్‌ బాధితులు... హామీ ఇచ్చి... సీఎం జగన్‌ మరిచిపోయారంటూ మండిపడ్డారు.

"అధికారం చేపట్టిన వారంలో న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు సాయం చేస్తామన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్ చేసి వారి ఆధీనంలో ఉంచుకున్నారు. చనిపోయేదాకా మాకు న్యాయం జరగదా?."-అగ్రిగోల్డ్​ బాధితులు

అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details