విజయవాడ దాసరి భవన్లో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశామని అగ్రిగోల్డ్ కష్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు చెప్పారు. గ్రామ సచివాలయాల ద్వారా అగ్రిగోల్డ్ బాధితుల అర్జీలను స్వీకరించి... సమస్యలను పరిష్కరించాలని కోరారు. అగ్రిగోల్డ్ ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. వాటిని తక్షణమే ప్రభుత్వం టేకోవర్ చేసి... బాధితులకు సత్వర న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై అర్జీలు ఇస్తామన్నారు. ఉన్నతాధికారులు వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి... సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
'అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం పరిరక్షించాలి'
విజయవాడలో అగ్రిగోల్డ్ కష్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేసి... పేదలకు పంచేందుకు వినియోగించాలని కోరారు.
'అగ్రిగోల్డ్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం పరిరక్షించాలి'