ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అగ్రిగోల్డ్‌ ఆస్తులు ఈడీ తాత్కాలిక జప్తు - అగ్రిగోల్డ్‌ ఆస్తులు ఈడీ తాత్కాలిక జప్తు వార్తలు

అగ్రిగోల్డ్‌ ఆస్తులను తాత్కాలిక జప్తు చేసిన ఈడీ
అగ్రిగోల్డ్‌ ఆస్తులను తాత్కాలిక జప్తు చేసిన ఈడీ

By

Published : Dec 24, 2020, 2:16 PM IST

Updated : Dec 24, 2020, 4:42 PM IST

14:15 December 24

అగ్రిగోల్డ్‌ ఆస్తులు ఈడీ తాత్కాలిక జప్తు

హైదరాబాద్‌ అగ్రిగోల్డ్‌ ఆస్తులను ఈడీ తాత్కాలిక జప్తు చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలోని రూ.4109 కోట్ల విలువైన అగ్రిగోల్డ్‌ ఆస్తులను అటాచ్‌ చేసింది. ఏపీలోని సుమారు 48 ఎకరాల్లోని హాయ్‌లాండ్‌ ఆస్తులను స్వాధీన పరుచుకుంది.

అగ్రిగోల్డ్ నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి  

అగ్రిగోల్డ్ నిందితులను 10 రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు, ప్రమోటర్లు శేషునారాయణరావు, హేమసుందర వరప్రసాద్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి లభించింది. ఈనెల 27 నుంచి జనవరి 5 వరకు కస్టడీలో నిందితులను ప్రశ్నించేందుకు న్యాయస్థానం అవకాశమిచ్చింది.  

ఇదీచదవండి

'ఇళ్ల పట్టాల పేరుతో రూ.6500 కోట్ల అవినీతి'

Last Updated : Dec 24, 2020, 4:42 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details