ఏపీసీడ్స్కు జాతీయస్థాయిలో అవార్డు దక్కటంపై వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు అధికారులను అభినందించారు. రాష్ట్రంలోని రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించటంలో ఏపీసీడ్స్ సంస్థ నిరంతర కృషి చేస్తోందని ఆయన ప్రశంసించారు.
'నాణ్యమైన విత్తనాలు అందించటంలో ఏపీసీడ్స్ నిరంతర కృషి' - Minister Kannababu latest news
ఏపీసీడ్స్కు జాతీయస్థాయిలో అవార్డు దక్కటంపై వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు అధికారులను అభినందించారు. రాష్ట్రంలోని రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించటంలో ఏపీసీడ్స్ సంస్థ నిరంతర కృషి చేస్తోందని ఆయన ప్రశంసించారు.
రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులు నాణ్యమైన విత్తనాల పంపిణీతో లబ్దిపొందారని మంత్రి వ్యాఖ్యానించారు. ఖరీఫ్ సీజన్ కంటే ముందుగానే ఈ విత్తనాలను అందించటంలో ఏపీసీడ్స్ కార్యాచరణ అభినందించదగినదని మంత్రి స్పష్టం చేశారు. కొవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలోనూ ఆయా ప్రాంతాలకు అవసరమైన విత్తనాలను రైతులకు భారం కాకుండా అందించటంలో ఏపీసీడ్స్ కృషి చేసిందని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:పచ్చని పంట పొలాల నడుమ అలరారుతున్న రామప్ప