ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్నికల ముందు సరే.. తర్వాత వాడేసిన బ్యాలెట్ పత్రాలు ఏం చేస్తారు? - ఎన్నికల తర్వాత ఐదేళ్ల వరకు బ్యాలెట్ పత్రాలు దాడి పెడతారు న్యూస్

ఎన్నికల ముందు బ్యాలెట్ పత్రాలు భద్రంగా దాచిపెడతారు.. ఆ విషయం తెలిసిందే. మరి ఎన్నికల తర్వాత ఎలా? ఇంతకీ బ్యాలెట్ పత్రాలను ఎన్నికలయ్యాక ఏం చేస్తారు?

after the election ballot paper store for 5 years
after the election ballot paper store for 5 years

By

Published : Feb 17, 2021, 3:18 PM IST

ఎన్నికలకు ముందు ఎంత భద్రంగా బ్యాలెట్‌ పత్రాలను చూసుకుంటారో... వినియోగించిన దానినీ అంతే జాగ్రత్తగా దాచిపెడతారు. విజేతలను ప్రకటించిన తర్వాత ఓటర్లు తీర్పునిచ్చిన బ్యాలెట్‌ పత్రాలను గ్రామాలవారీగా ప్రత్యేకమైన పెట్టెల్లో భద్రపరుస్తారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించిన గ్రామ పంచాయతీ స్టేజ్‌-2 అధికారులు సదరు బ్యాలెట్‌ పత్రాలు, ఎన్నికలకు వినియోగించిన పత్రాలను మండల పరిషత్‌ అధికారులకు అందజేస్తారు. వాటిని ప్రత్యేకమైన పెట్టెల్లో పోలీసుస్టేషన్‌ల్లో కానీ, ట్రెజరీ కార్యాలయాల్లో కాని భద్రపరుస్తారు. వినియోగించిన బ్యాలెట్‌ పత్రాలను అయిదేళ్లపాటు దాచి ఉంచుతారు. ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వంటి వాటిపై.. వివాదం నెలకొని కోర్టుల్లో అప్పీలు చేస్తే వారి ఉత్తర్వుల మేరకు స్టేజ్‌-2 అధికారులు ఈ పెట్టెలను తెరుస్తారు.

ABOUT THE AUTHOR

...view details