ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చెదలు పట్టిన డబ్బులు.. పనికి రాని ఫర్నిఛర్​..! - latest news vijayawada

లాక్​డౌన్​ కారణంగా రెండు నెలల తర్వాత తన దుకాణాన్ని తెరిచిన ఓ వ్యక్తికి లోపలి వాతావరణం కన్నీళ్లు తెప్పించింది. ఇంతకు ముందు ఎంతో శుభ్రంగా ఉండే తన దుకాణాన్ని చూసి నివ్వెరపోవాల్సి వచ్చింది. ఎక్కడ చూసినా చెద పురుగులు.. పాడైపోయిన సామగ్రి.. పట్టుకుంటే పొడిపొడవుతున్న కరెన్సీ నోట్లు.. ఉపాధి లేకపోవడమే కాకుండా ఇప్పుడు మళ్లీ సామగ్రి అంతా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు....

lockdown shops damage vijayawadaat
చెదలు పట్టిన కరెన్సీ నోట్లు

By

Published : May 25, 2020, 4:10 PM IST

Updated : May 25, 2020, 4:16 PM IST

కరోనా లాక్​డౌన్​ ఎంతో మంది జీవితాలను అల్లకల్లోలం చేసింది. కొంత మందికి తినడానికి తిండి లేకుండా చేసింది. మరికొంత మందికి ఉపాధిని దూరం చేసింది. అందులో ఒకరు.. విజయవాడ వన్​టౌన్​లోని కొత్తపేట కోమలావిలాస్​ సెంటర్​లో కిల్లీ బడ్డి నిర్వహకుడు. రెండు నెలల క్రితం లాక్​ డౌన్​ ప్రకటించడంతో కిల్లీ బడ్డీని మూసేశాడు. ఆ తర్వాత లాక్​డౌన్​ పెంచుకుంటూ రావడంతో బడ్డీని తెరవలేదు. ప్రస్తుతం సడలింపులు ఇవ్వడంతో బడ్డీని తెరిచి చూసి ఒక్కసారి ఖంగు తిన్నాడు.

చెదలు పట్టిన కరెన్సీ నోట్లు

విజయవాడ వన్​టౌన్​లోని కొత్తపేట కోమలావిలాస్​ సెంటర్​లో కిల్లీ బడ్డి నిర్వహకుడు రెండు నెలల తర్వాత తన దుకాణాన్ని తెరచి చూడగా ఒక్కసారిగా లోపలి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో పాటు దుమ్ము, బూజు పట్టిపోయిన బల్లలు, కుర్చీతోపాటు ఇతర వస్తువుల్నీ చూసి నివ్వెరపోయాడు. ఇన్ని రోజులుగా దుకాణం తెరవకపోవడంతో అందులోని వస్తువులన్నీ ఎందుకు పనికిరాకుండా తయారయ్యాయి. కరెన్సీ నోట్లను చెదపురుగులు తినేయడంతో నోట్లు పనికి రాకుండా పోయాయి. కాగితం చేతిలోకి తీసుకుంటే పూర్తిగా పొడిపొడి అవుతుండటంతో దుకాణ నిర్వాహకునికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. కరోనా కేసుల ఉదృతి దృష్ట్యా విజయవాడ నగరంలోని ఈ ప్రాంతం రెడ్​జోన్​లో ఉండడం... చిన్నదుకాణాలు తెరిచేందుకు అనుమతించని పరిస్థితుల్లో రోజుల తరబడి తమ దుకాణాలు మూతపడే ఉన్నాయని ... ఇప్పుడు సడలింపులతో తాళాలు తీసిచూస్తే లోపలి వాతావరణం కన్నీళ్లు తెప్పించిందని దుకాణ నిర్వాహకుడు పేర్కొన్నాడు. పూర్తిగా లాక్​డౌన్ సడలించిన తర్వాత చాలా దుకాణాల్లో ఇంతకు మించిన దారుణ పరిస్థితులే కనిపిస్తాయనే అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: భారత హాకీ లెజెండ్​ బల్బీర్ ​సింగ్ ఇకలేరు

Last Updated : May 25, 2020, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details