ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎయిడెడ్ కళాశాలలు ప్రైవేటీకరణ విరమించి.. ఆస్తులు పరిరక్షించాలి - విజయవాడ వార్తలు

రాష్ట్రంలో ఎయిడెడ్ కళాశాలల రద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని అఫిలియేటెడ్ కళాశాలల ఉపాధ్యాయుల సంఘం తరఫున పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు డిమాండ్ చేశారు. వాటికి సంబంధించిన వేలకోట్ల రూపాయల ఆస్తులను ప్రభుత్వం పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు.

aided colleges privatisation
ఎయిడెడ్ కళాశాలలు ప్రైవేటీకరణ విరమించి.. ఆస్తులు పరిరక్షించాలి

By

Published : Apr 19, 2021, 3:42 PM IST

విద్యారంగ అభివృద్ధికి ఎయిడెడ్ వ్యవస్థ ఎంతో కృషి చేసిందని.. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడం వెనుక కుట్ర ఉందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు ఆరోపించారు. ఎయిడెడ్ కళాశాలల వ్యవస్థకు సుమారు 40 వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయని విజయవాడలో అన్నారు. స్వాతంత్య్రం రాక ముందు నుంచి ఎయిడెడ్ కళాశాలలు.. అన్ని వసతులతో విద్యా బోధన చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా వ్యవస్థను వదిలించుకోవాలని చూడడం సరైనది కాదని అన్నారు. పేద విద్యార్థులు వీటిలో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారన్నారు. ఎయిడెడ్ కళాశాలల ఆస్తులను పరిరక్షించి.. ఎయిడెడ్ వ్యవస్థ రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 25 నుంచి నిరసన, బంద్ కార్యక్రమాలు చేపడతామని అఫిలియేటెడ్ కలశాలల ఉపాధ్యాయుల సంఘం హెచ్చరించింది.

ABOUT THE AUTHOR

...view details