ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

‌ఒక్క అవకాశం..ఫెయిలైన వారిని పాస్​ చేయాలని డిప్లమో విద్యార్ధుల విజ్ఞప్తి - krishna updates

పాలిటెక్నిక్‌ డిప్లమో ఫెయిల్‌ అయిన వారిని ప్రభుత్వం ఓ అవకాశంగా పాస్​ చేయాలని బాధిత విద్యార్ధులు విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారులు స్పందించి.. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. పరీక్షల నిర్వహణపై ముందస్తు... సమాచారం లేనందున సన్నద్ధత కాలేకపోయామని వాపోయారు.

polytechnic diplomas  students have appealed to the government to pass
‌ డిప్లమో ఫెయిల్‌ అయిన వారిని పాస్​ చేయాలని డిమాండ్​

By

Published : Nov 23, 2020, 2:52 PM IST

రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్‌ డిప్లమో పరీక్షలు రాసి ఫెయిల్‌ అయిన వారికి ప్రభుత్వం ఓ అవకాశంగా ఉత్తీర్ణత కల్పించాలని బాధిత విద్యార్ధులు విజ్ఞప్తి చేశారు. విజయవాడ ప్రసాదంపాడులోని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షలు నిర్వహించే విషయంలో ముందస్తు ప్రకటన లేదని, కరోనా కారణంగా కళాశాలలు మూతపడ్డాయన్నారు. ఒక్కసారిగా జారీ అయిన పరీక్షల నోటిఫికేషన్‌ వల్ల తాము సన్నద్ధత కాలేకపోయామని, తక్కువ మార్కులతో పరీక్షలో ఫెయిల్‌ అయ్యామని ఆవేదన చెందారు.

పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు మాదిరిగా ఇలాంటివారికి డిప్లమో ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని కోరారు. పదో తరగతి విద్యార్ధతతో తమకు సరైన ఉద్యోగాలు రావడం లేదని అన్నారు. ఇప్పుడు డిప్లమో పూర్తి చేయలేక కుటుంబం నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నామని తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి బాధిత విద్యార్ధులు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయానికి తరలివచ్చి తమ గొడును వెల్లబుచ్చుకున్నారు.

ఇదీ చదవండీ...పదేళ్ల తరువాత గనుల అక్రమ తవ్వకాలకు యత్నం

ABOUT THE AUTHOR

...view details