ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 20, 2021, 10:15 PM IST

ETV Bharat / city

కరోనా వైరస్ నిర్మూలనకు ఆ రైల్వే స్టేషన్​లో అధునాతన యంత్రాలు

రైల్వే ప్రయాణికుల ఆరోగ్య పరిరక్షణ కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందుకు విజయవాడలోని రైల్వే స్టేషన్​లో శానిటైజేషన్​, స్కానింగ్ కోసం అధునాతన యంత్రాలను ఏర్పాటు చేసింది. కరోనా వైరస్​ను నిర్మూలించేలా వీటిని రూపొందించారు.

advanced machines at vijayawada railway station
విజయవాడ రైల్వే స్టేషన్​లో అధునాతన యంత్రాలు

రైల్వే ప్రయాణికుల ఆరోగ్య పరిరక్షణ కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రైల్వే స్టేషన్లు, రైళ్లలో కరోనా వైరస్ వ్యాప్తి, నివారణకు అధునాతన స్కానర్లు ఏర్పాటు చేస్తోంది. విజయవాడలోని రైల్వే స్టేషన్​లో శానిటైజేషన్, స్కానింగ్​తో కూడిన అధునాతన కియోస్క్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు లోపలికి వెళ్లే స్టేషన్ తూర్పు బుకింగ్ కార్యాలయం సమీపంలో దీన్ని ఏర్పాటు చేశారు.

లగేజీ బ్యాగ్​లపై శక్తి వంతమైన ఆల్ట్రా వైలట్ కిరణాలును ప్రసరింప జేయడం ద్వారా కరోనా వైరస్​ను నిర్మూలించేలా దీన్ని రూపొందించారు. దీనికి నామమాత్రపు ఫీజును నిర్ణయించారు. శానిటేషన్ కోసం 25 కేజీల లోపు బ్యాగ్ స్కానింగ్​కు రూ.10, ఆ పైన బరువున్న వాటికి రూ.20 రుసుముగా నిర్ణయించారు. ఆల్ట్రా వైలట్ కిరణాలతో స్కానింగ్ కోసం 25కేజీల లోపు బ్యాగ్​కు రూ.50, ఆ పైన బరువున్న వాటికి రూ.70 రుసుముగా నిర్ణయించారు.

ఇదీ చదవండి:'మీకు దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారు'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details